Tirupati: ఓ యాచకుడి ఇంట్లో దొరికిన రూ.10 లక్షలు

Tirupati: తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో పది లక్షల రూపాయలు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు.

Update: 2021-05-18 02:21 GMT

Tirupati: ఓ యాచకుడి ఇంట్లో దొరికిన రూ.10 లక్షలు

Tirupati: తిరుపతిలో ఓ యాచకుడి ఇంట్లో పది లక్షల రూపాయలు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. స్థానిక శేషాచల కాలనీలో శ్రీనివసన్ అనే యాచకుడికి టీటీడీ ఇంటిని కేటాయించింది. తిరుమలకు వచ్చే వీఐపీ భక్తుల వద్ద యాచించుకుంటు రెండు ట్రంకు పెట్టెల నిండ కరెన్సీ నోట్లను నింపుకున్నాడు.

గతేడాది అనారోగ్య సమస్యలతో శ్రీనివాసన్ మృతి చెందాడు. మృతుడికి వారసులెవ్వరు లేకపోవడంతో ఇంటిని జప్తు చేసుకునేందుకు టీటీడీ అధికారులు వెళ్లారు. ఇంట్లో కరెన్సీ కట్టలను చూసి ఒక్కసారిగా షాక్ కు గురై పై అధికారులకు సమాచారమందించారు. విజిలెన్స్ సమక్షంలో టీటీడీ సిబ్బంది నగదు లెక్కపెడుతున్నారు. పది లక్షలు దాటి నగదు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News