బడికి వెళ్లమన్నారని తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు!
కన్న తల్లిదండ్రులు చిత్రహింసలు పెడుతున్నారని ఓ బాలుడు పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఆర్ పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన ఒంటిపై గాయాలు చూపించి, తల్లిదండ్రులు వెధిస్తున్నారని, హీటర్ తో గాయలు చేస్తుంటే పరుగులు తీశానని పోలీసుకు ఫిర్యాదు చేశాడు.
కన్నతల్లిదండ్రులు చిత్రహింసలు పెడుతున్నారని ఓ బాలుడు పోలీసు స్టేషన్ కు వెళ్లిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఆర్ పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. తన ఒంటిపై గాయాలు చూపించి, తల్లిదండ్రులు వెధిస్తున్నారని, హీటర్ తో గాయలు చేస్తుంటే పరుగులు తీశానని పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక్కసారిగా బాలుడు ఇచ్చిన ఫిర్యాదులో రంగంలో దిగిన పోలీసులు. బాలుడి తల్లిదండ్రులను విచారణ నేపథ్యంలో స్టేషన్కు పిలిపించారు. బాలుడి తల్లిదండ్రులను విచారించగా వారికి వాస్తవం ఆర్థమైంది. బాలుడు బడికి వెళ్లనని మారం చేస్తుంటే తల్లిదండ్రులు బడికి వెళ్లాలని మందలిస్తేనే స్టేషన్కు వచ్చాడని విచారణలో తెలిసింది. దీంతో పోలీసులు బాలుడు అబద్ధం చెప్పాడని గ్రహించి అతనికి కౌన్సింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.