YS Sharmila: దొర చేసిన అప్పులకు ఎనిమిదిన్నరేళ్లుగా కట్టిన వడ్డీ లక్ష కోట్లు..

YS Sharmila: ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్లు రాష్ట్ర పరిస్థితి

Update: 2022-12-31 12:45 GMT

 YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై వై.ఎస్.షర్మిల విమర్శలు 

YS Sharmila: తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శలు గుప్పించారు." పైన పటారం.. లోన లోటారం""ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ" అన్నట్లు రాష్ట్ర పరిస్థితి ఉందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దొర చేసిన అప్పులకు రాష్ట్ర ఆదాయం కిస్తీలకే మిగలట్లేదన్నారు. రాష్ట్రం సిద్ధించిన నాటికి సంపద 16వేల కోట్లు ఇప్పుడు అప్పు 4లక్షల 50వేల కోట్లు ఉందన్నారు. దొర చేసిన అప్పులకు ఎనిమిదిన్నర ఏండ్లుగా కట్టిన వడ్డీ లక్ష కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

ఇంత అప్పు చేసినా జనానికి ఒరిగింది మాత్రం సున్నా అని విమర్శించారు. ఆరోగ్యశ్రీకి డబ్బుల్లేవ్ ఫీజు రీయింబర్స్ మెంట్ కు పైసల్ లేవన్నారు. ఏ పథకానికి నిధుల్లేవని ఆఖరికి ఉద్యోగుల జీతాలకు కూడా అతీగతీ లేదన్నారు. మీ పార్టీ అకౌంట్ లో 860కోట్లకు వడ్డీలు మీరు తినాలే! రాష్ట్ర అప్పులకు వడ్డీలు జనాలు కట్టాల్నా? అని షర్మిల ప్రశ్నించారు. ధనిక రాష్ట్రం అంటూనే జనాలను జలగల్లా పీల్చుకుతింటుండు దొర అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసి బంగారు తెలంగాణ చేశానని, ఇక బంగారు భారత్ చేస్తానంటూ దేశాన్ని దోచుకోడానికి పోతుండు అని షర్మిల పేర్కొన్నారు.

Tags:    

Similar News