Telangana DGP: తెలంగాణలో తప్పు చేస్తే శిక్ష తప్పదు
Telangana DGP: తెలంగాణలో తప్పు చేస్తే శిక్ష తప్పదు
Telangana DGP: తెలంగాణలో తప్పు చేస్తే శిక్ష తప్పదని.. నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని డీజీపీ జితేంధర్ తెలిపారు. బాధితులకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఉంటే.. వారికి అండగా నిలుస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నేరం చేసిన వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోకుండా న్యాయస్థానాల్లో శిక్ష పడేలా ఆధారాలు సేకరించి.. ప్రణాలికతో కృషి చేస్తున్నామన్నారు. పోలీసులు కేసుల విచారణ సమయంలో భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు మద్దతుగా నిలుస్తున్నామన్నారు. తీవ్రమైన నేరాల్లో ఉరి, జీవిత ఖైదు పడేలా చూస్తామన్నారు. చిన్నారులు, మహిళల పట్ల జరిగే నేరాల్లో కఠినంగా వ్యవహరించాలని పోలీసులను డీజీపీ ఆదేశించారు.