Sriram Sagar Project: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ఉధృతి
Sriram Sagar Project: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.
Sriram Sagar Project: ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర, SRSP క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షం కురుస్తుండటంతో ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. 4 రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,090 అడుగులకు గాను ప్రస్తుతం 1,073.70 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30.153 టీఎంసీలకు చేరుకుంది.