హుస్సేన్ సాగర్‎ చుట్టూ పేరుకుపోయిన వ్యర్థాలు

పండుగ ముగిసింది.. వ్యర్థాలు మిగిలాయి. భాగ్యనగరంలో వినాయక చవితిలానే, దసరా వేడుకల తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. దీంతో మరోసారి ట్యాంక్ బండ్ చుట్టూ వ్యర్థాలు పేరుకుపోయాయి.

Update: 2020-10-28 15:30 GMT

Tank Bund (File Photo)

పండుగ ముగిసింది.. వ్యర్థాలు మిగిలాయి. భాగ్యనగరంలో వినాయక చవితిలానే, దసరా వేడుకల తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. దీంతో మరోసారి ట్యాంక్ బండ్ చుట్టూ వ్యర్థాలు పేరుకుపోయాయి. నిమజ్జనానికి ఏర్పాట్లు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు ఆ తర్వాత ట్యాంక్ బండ్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో సాగర్ డంపింగ్ యార్డ్ ను తలపిస్తోంది.

హైదరాబాద్ నగరంలో బతుకమ్మ వేడుకలతో పాటు.. వీధి వీధిలో అమ్మవారి విగ్రమాలు పెట్టి ఘనంగా పూజలు జరిపారు. ఆ తరువాత అమ్మవారిని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. అయితే అధికారులు మాత్రం నిమజ్జనం కోసం ప్రత్యేక క్రేన్ లు పెట్టి హడావుడి చేశారు. కాని ఆ తరువాత క్లీనింగ్ ను మాత్రం గాలికి వదిలేశారు. 

ప్రస్తుతం ట్యాంక్ బండ్ పరిశర ప్రాంతాలన్నీ డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. అమ్మవారి పూజా విగ్రహాల నిమజ్జనం తరువాత చేయలేదు. దీంతో చెత్తా, చెదారం విపరీతంగా పెరుకుపోయింది. ట్యాంక్ బండ్ మీద నడుస్తూ వెళుతున్న పాదాచారులు, వాహనదారులు ఈ దుర్గంధాన్ని భరించలేక పోతున్నామని వాపోతున్నారు.

మామూలుగానే దుర్గంధానికి హుస్సేన్ సాగర్ కేరాఫ్ అడ్రస్. దీనికి తోడు పండుగ వ్యర్థాలు తోడవ్వడంతో ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి సాగర్ పరిశరాలను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు. అటు అధికారులు మాత్రం వరదల సర్వేలో బిజీగా ఉండడంతోనే ట్యాంక్ బండ్ పై దృష్టి పెట్టలేకపోతున్నామంటున్నారు.

Tags:    

Similar News