జాంబాగ్ డివిజన్‌లో బీజేపీ ఆందోళనకు దిగింది. ఓట్ల గల్లంతుపై అభ్యంతరం తెలుపుతూ.. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆందోళనకు దిగారు. 471 ఓట్లకు బదులుగా.. బాక్సులో 257 మాత్రమే ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని చెబుతున్నారు. కన్ఫూజన్‌లో అలా జరిగిపోయిందన్నట్లుగా అధికారులు బదులిచ్చారు. అధికారుల తీరుపై బీజేపీ నేతలు కన్నెర్రజేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు.. అవసరమైతే ఇక్కడ జరిగిన ఎన్నికను రద్దు చేయాలని కూడా కోరాలని కమలనాథులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.