రాహుల్ గాంధీ ముందుగా తెలంగాణకు క్షమాపణలు చెప్పాలి.. ఎందుకంటే : కేటీఆర్

Update: 2024-11-04 14:34 GMT

KTR's open letter to Rahul Gandhi: రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. హామీలను నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేపు నవంబర్ 5న రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. అందుకే అంతకంటే ఒక్క రోజు ముందు కేటీఆర్ ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు.

పదేళ్లలో ఘనంగా అభివృద్ది చెందిన తెలంగాణకు విచ్చేస్తున్న రాహుల్ గాంధీ, పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా ఒక్కసారి మీకు గుర్తు చేయదలుచుకున్నాను అంటూ కేటీఆర్ తన లేఖను మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు తెలంగాణలో ఏ పిల్లాడికి కూడా కష్టమొచ్చిన సరే ఇలా పిలిస్తే అలా వస్తానని చెప్పి తీరా గద్దెనెక్కిన తర్వాత మా ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని కేటీఆర్ అన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆటోడ్రైవర్లు, చేనేత కార్మికులు, మూసీ, హైడ్రా బాధితులు ఇలా ఒక్కరేంటి సమాజంలో అన్ని వర్గాలను నయనంచనకు గురిచేశారని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.

నమ్మించి మోసం చేయటమనే నైజం కాంగ్రెస్ పార్టీ నరనరాల్లోనే ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఆరు గ్యారంటీలు, అభయ హస్తం అంటూ ఇక్కడి ప్రజలను మోసం చేసేందుకు ముందుగా ఢిల్లీ నుంచి వచ్చి నాంది పలికింది మీరేనని రాహుల్ గాంధీకి గుర్తుచేశారు. యథా రాజా తథా ప్రజా అన్నట్లు ఆ తర్వాత మీ బాటలోనే ఇక్కడి నాయకులు నడుస్తున్నారని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలు బాధ్యత నాది అని చెప్పిన మీరు… అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువైపు తొంగి కూడా చూడలేదన్నారు. కేటీఆర్ తన లేఖలో ఇంకా ఏమేం రాశారో మీరే చూడండి.









Tags:    

Similar News