School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..పాఠశాలలకు 5 రోజులు సెలవులు..ఎప్పట్నుంచంటే?
School Holidays: విద్యార్ధులకు శుభవార్త. ఎందుకంటే 5రోజులు పాటు పాఠశాలలకు సెలవులు వస్తున్నాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకో తెలుసుకుందాం.
School Holidays: పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. నవంబర్ లో హైదరాబాద్ లో పాఠశాలలకు ఐదు రోజులు పాటు సెలవులు వస్తున్నాయి. వీటిలో గురునానక్ జయంతి సెలవుతోపాటు ఏ ఏ హాలిడేస్ వస్తున్నాయో చూద్దాం.
నవంబర్ లో హైదరాబాద్ పాఠశాలలకు ఒక సాధారణ సెలవు ఉంటుంది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో సాధారణ సెలవులు ఒకరోజు మాత్రమే ఉంది. గురు నానక్ జయంతి సందర్భంగా నవంబర్ 15వ తేదీన సెలవు ప్రకటించింది ప్రభుత్వం.ఇదే కాకుండా హైదరాబాద్ లోని కొన్ని పాఠశాలలకు నవంబర్ 16వ తేదీన సయ్యద్ మహమ్మద్ అల్ మహ్దీఅల్ మౌద్ జౌన్ పురి పుట్టినరోజు కోసం సెలవు ఉంటుంది.
ఈ హాలుడే కాకుండా అదనంగా నెలలో నాలుగు ఆదివారాలు కూడా ఉన్నాయి. అంటే ఈ రోజుల్లో ఎలాగో పాఠశాలలకు సెలవు ఉంటుంది. అందువల్ల విద్యార్థులకు హాలుడే ఉన్నట్లే. నవంబర్ 3 ఆదివారం, నవంబర్ 10 ఆదివారం, నవంబర్ 15 గురునానక్ జయంతి, నవంబర్ 16 సయ్యద్ మొహమ్మద్ అల్ మహదీ అల్ మౌద్ జాన్ పురి పుట్టినరోజు ఉంటుంది. అలాగే నవంబర్ 17వ తేదీ ఆదివారం, నవంబర్ 24 ఆదివారం ఉంది.
ఇక గత అక్టోబర్ నెలలో 16రోజులు సెలవులు వచ్చాయి. గత నెలలో నగరంలోని పాఠశాలలకు 16రోజులు సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. దసరా సెలవులు 13రోజులు వచ్చిన విషయం తెలిసిందే. సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి అక్టోబర్ 21 నుంచి 28 వరకు సమ్మేటివ్ అసెస్ మెంట్ నిర్వహించాయి. అయితే ఈ నెలలో పాఠశాలలకు ఐదు రోజులు మాత్రమే సెలవులు ఉన్నాయి.