Nizamabad: 5 కోట్లు స్వాహా చేసిన యూనియన్ బ్యాంకు మేనేజర్
Nizamabad: రుణాల సొమ్ము తన ఖాతాకు బదిలీ చేసుకున్న బ్యాంక్ మేనేజర్
Nizamabad: లోన్ ఇప్పిస్తామని నమ్మించాడు. ఆ బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి లోన్ కోసం అప్లై చేశారు. అయితే..లోనైతే మంజూరైంది..కానీ..లబ్దిదారుల ఖాతాల్లో మాత్రం ఆ లోన్ నిధులు జమ కాలేదు. నిజామాబాద్‌లో యూనియన్ బ్యాంకు మేనేజర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 40 మందికి చెందిన రుణాల సొమ్ము 5 కోట్లు కాజేశాడు బ్యాంక్ మేనేజర్ అజయ్.
లోన్ కోసం అప్లై చేసుకున్న వారికి.. 8 నెలల క్రితం టర్మ్ లోన్‌తో పాటు సీసీ లోన్‌లు మంజూరయ్యాయి. అయితే.. లోన్ మంజూరైన వెంటనే.. ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు అజయ్. బ్యాంక్ మేనేజర్ మాటలు నమ్మి మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్‌లో కంప్లైట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. రుణాల మంజూరులో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. 5 కోట్ల రూపాయలతో ఉడాయించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.