కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై ఈసీకి TRS బృందం ఫిర్యాదు
*రాజగోపాల్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్ బృందం
Munugode: తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల వేళ అనుకోని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని.. క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని.. 18వేల కోట్ల పనులు తీసుకొని.. మునుగోడులో ఓట్లు కొంటున్నారని ఆరోపించారు.