టీఆర్ఎస్ లో మరో విషాదం: నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల‌ నర్సింహ్మయ్య గుండె‌పోటుతో మృతి!

టీఆరెస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఇక లేరు.

Update: 2020-12-01 01:57 GMT

TRS MLA Nomula Narsimhaiah 

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల‌ నర్సింహ్మయ్య హైదరాబాదు ఆపోలో ఆస్పత్రిలో గుండె పోటుతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా నర్సింహయ్య. అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందారు. 

1999,2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల.. 2009 భువనగిరి ఎంపీగా సిపిఎం నుంచి ఓటమి చెందారు. తరువాత ఆయన 2013 లో టీఆర్ఎస్ లో చేరారు. 

2014లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. అయితే, 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై ఘన విజయం సాధించిన నోముల నర్సింహయ్య.

సిపిఎం పార్టీ ఎమ్మెల్యే గా ఉన్నపుడు అసెంబ్లీ లో నర్సింహ్మయ్య  ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. 

నోముల‌ నర్సింహ్మయ్య స్వగ్రామం నకరికల్లు మండలం‌ పాలెం. నోముల నర్సింహయ్య కు ఒక కొడుకు ,ఇద్దరు కుమార్తెలు. గత కొంతకాలంగా మెడపై కణితి తో పాటు శ్వాస సమస్యతో భాదపడుతున్న నోముల నర్సింహ్మయ్య. కరోనా వైరస్ ను జయించిన ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య. శ్వాస సమస్యను అధిగమించడానికి రోజుకు మూడు నాలుగు గంటలు యోగా చేసిన నోముల నర్సింహయ్య.

అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతొ.. మూడు రోజుల క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలోని ఆపోలో ఆస్పత్రిలో చేరిన నోముల నరసింహయ్య. తెల్లవారుజామున ఐదు గంటలకు గుండె పోటు తో మృతి చెందిన నోముల నర్సింహయ్య. ఆయన మృతి తొ నాగార్జున సాగర్ నియోజకవర్గం లో ,స్వగ్రామం లో విషాద చాయలు అలుముకున్నాయి. 

నోముల నర్సింహయ్య మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి ,సహచర నల్గొండ జిల్లా ఎమ్మెల్యే లు. ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని హాలియాలో ప్రజల సందర్శనార్ధం నోముల పార్ధివదేహాన్ని ఉంచి ....రేపు నకరికల్లు మండలం‌ పాలెం అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం..

 

Tags:    

Similar News