Yadadri: యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణరావుపై బదిలీ వేటు
Yadadri: ప్రొటోకాల్ విషయంపై ఈవోను బదిలీ చేసిన దేవాదాయ శాఖ
Yadadri: యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావుపై ప్రభుత్వం బదిలీ వేటువేసింది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రొటోకాల్ పాటించలేదన్న ఆరోపణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టారు. దీంతో ఉపముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని... తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు. అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవోపై చర్యలు తీసుకున్నారు. యాదాద్రి ఈవోగా భాస్కర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.