Top-6 News of the Day: కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీ మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-13 13:50 GMT

Arekapudi Gandhi

Top-6 News of the Day (13/07/2024)

1. బీఆర్ఎస్ కు షాక్: కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీ

బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరారు. జూలై 12న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. జూలై 13న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు.


2. ఆంధ‌్రప్రదేశ్ లో37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 37 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11న 19 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనపై ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో పనిచేసిన అధికారుల స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేశారు.


 3. ఉప ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమి విజయం

దేశంలోని ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 11 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఒక్క స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి నెగ్గారు. పశ్చిమ బెంగాల్ లో నాలుగు, హిమాచల్ ప్రదేశ్ లో మూడు, ఉత్తరాఖండ్ లో రెండు,పంజాబ్, బీహార్,తమిళనాడు, మధ‌్యప్రదేశ్ లలోని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. 


 4. స్పీడ్ బ్రేకర్లుండవు: చంద్రబాబు

మంచి చేయాలనుకొనేవారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంచి చేసే వారంతా ఏపీలో ఒక ముందుకు రావాలని ఆయన కోరారు. వెంకటేశ్వరస్వామి దయతోనే తాను అప్పట్లో బాంబు దాడి నుండి బయటపడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.


5. ఇటలీలో 33 మంది భారత కార్మికులకు విముక్తి

ఇటలీలో 33 మంది భారత కార్మికులను వెట్టిచాకిరి నుండి పోలీసులు విముక్తి కల్పించారు. భారతీయుల నుండి వెట్టిచాకిరి చేయిస్తున్న ఇద్దరి నుండి 5,45, 300 మిలియన్ యూరోలను స్వాధీనం చేసుకున్నారు. వెరోనా ప్రావిన్స్ లో ఈ ఘటన జరిగింది.


6. స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీ రేవంత్

త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణ విద్యార్థులు తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏఐకి సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందన్నారు. జేఎన్ టీయూలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Tags:    

Similar News