School Holidays: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రెండు రోజులు సెలవులు

Telangana School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి రెండు రోజులపాటు స్కూల్లకు సెలవులు రానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ బంద్ కు పిలుపునిచ్చింది.

Update: 2024-06-25 00:21 GMT

School Holidays: తెలంగాణలో 3 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎందుకు? ఎప్పటినుంచి?

School Holidays: జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, అటు ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ రెండు రోజులు పాటు స్కూళ్లలను బంద్ పెట్టాలని పిలుపునిచ్చింది. జూన్, 25, 26వ తేదీల్లో పాఠశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. స్కూల్స్ ప్రారంభమై 15 రోజులు పూర్తయినా పుస్తకాలను మాత్రం ఇంకా పంపిణీ చేయకపోవడం, విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని ఏబీవీపీ ఆరోపిస్తోంది.

రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని..పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. విద్యాసమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది ఏబీవీపీ. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతోంది. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. స్కూళ్లలను స్వచ్చందంగా బంద్ చేయాలని కోరారు. 

Tags:    

Similar News