Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు
Asaduddin Owaisi: ఒవైసీ నివాసంపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి
Asaduddin Owaisi: దేశరాజధాని ఢిల్లీలోని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అశోక్ రోడ్డులోని ఒవైసీ నివాసంపై నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు. దీంతోపాటు పోస్టర్లు కూడా అతికించారు. అందులో భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్ నినాదాలు రాసి ఉన్నాయి. ఈ ఘటనపై ఒవైసీ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు పిర్యాదు చేయడంతో ఆయన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. దాడి ఘటనపైఒవైసీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు తాను భయపడేది లేదని చెప్పారు.