Rythu Runa Mafi: రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం.. రూ.37 వేల నుంచి రూ.41 వేల వరకు రుణమాఫీ
Rythu Runa Mafi: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది.
Rythu Runa Mafi: తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైంది. 37 వేల నుంచి 41 వేల వరకు రుణమాఫీ కోసం ఆర్థికశాఖ 167.59 కోట్లు విడుదల చేసింది. దీంతో 44 వేల 870 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలన్నర రోజుల్లో... అంటే సెప్టెంబరు రెండో వారం వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే... తాజాగా.. 37 వేల నుంచి 41 వేల వరకు రుణమాఫీకి సంబంధించి ఆర్థికశాఖ 167.59 కోట్లు విడుదల చేసింది.