Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం కసరత్తు.. బిల్లుకు మోక్షం దక్కేనా..?

Women Reservation Bill: మహిళా బిల్లు పెట్టాలని ఇప్పటికే కవిత, సోనియా డిమాండ్

Update: 2023-09-18 09:30 GMT

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం కసరత్తు.. బిల్లుకు మోక్షం దక్కేనా..?

Women Reservation Bill: ప్రత్యేక పార్లమెంట్ సెషన్‌లో కేంద్రం కీలక బిల్లు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఎప్పటి నుంచో డిమాండ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈనెల 20న పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్‌ ఎన్నికల ముందు కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ బిల్లు ఆమోదం పొంది చట్ట రూపం దాల్చితే.. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ దక్కనుంది. మహిళా సాధికారత, సమాన అవకాశాల కోసం బిల్లు పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్స్ వినిపిస్తున్నాయి.ఒకవేళ కేంద్రం బిల్లు ప్రవేశపెడితే.. ఆమోదించడానికి విపక్షాలు కూడా సుముఖంగానే ఉన్నాయి. ఈ సెషన్స్ లో మహిళా బిల్లు పెట్టాలని ఇప్పటికే కవిత, సోనియా డిమాండ్ చేశారు. ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు కేసీఆర్.

Tags:    

Similar News