TS News: తెలంగాణలో రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
TS News: రాష్ట్రవ్యాప్తంగా 2,652 పరీక్షా కేంద్రాలు
TS News: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏప్రిల్ 13 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 వేల 652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరుగనుంది. అయితే సైన్స్, కాంపోజిట్ పేపర్లకు మాత్రం 20 నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయించారు.
ఇక పేపర్ లీకేజీని అరికట్టడంలో భాగంగా పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లపై నిషేధం విధించారు. ఎండల తీవ్రతల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సిట్టింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దింపారు.