Hanamkonda: హన్మకొండలో ఉద్రిక్తత.. కలెక్టరేట్ ముట్టడికి ఆశావర్కర్ల యత్నం
Hanamkonda: పోలీసులు, ఆశావర్కర్ల మధ్య తోపులాట, గాయాలు
Hanamkonda: హన్మకొండలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టరేట్ ముట్టడికి ఆశావర్కర్లు ప్రయత్నించారు. కనీస వేతనం చెల్లించాలని.. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు, ఆశావర్కర్ల మధ్య తోపులాట జరిగింది.