Telangana Tenth class original Memos: త్వరలోనే టెన్త్ ఒరిజినల్ మెమోలు
Telangana Tenth class original Memos: ఎస్సెస్సీ బోర్డు అధికారులు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లుచేస్తున్నామని తెలిపారు.
Tenth class original memos issued soon : తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల షాట్ మెమోలను ప్రభుత్వం ఇప్పటికే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ఎస్సెస్సీ బోర్డు అధికారులు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లుచేస్తున్నామని తెలిపారు. అయితే ఈ మెమోలు విద్యార్ధులకు పంపిణీ చేయడానికి ముందు మెమోల్లో విద్యార్ధులకు సంబంధించిన పేరు, పుట్టిన తేది, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయా వేవో పరీక్షించుకోవడానికి అవకాశం కల్పించింది. ఒక వేళ మెమోల్లో తప్పులు, అక్షరదోషాలు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకోవడానికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు. మెమోల్లో అక్షర దోషాలను సరిదిద్దుకొవడానికి మరో వారంరోజుల వరకు అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. ఆ తరువాత ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఒరిజినల్ మార్కుల మెమోలు స్కూళ్లవారీగా పంపిస్తామని తెలిపారు.
ఇక పోతే ఈ ఏడాది కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో రాష్ట్రంలోని విద్యార్ధులందరికీ పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులను చేసింది. అన్ని తరగతుల విద్యార్ధులతో పాటు పదో తరగతి విద్యార్ధులకు కూడా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులను చేసింది. విద్యార్ధులకు ఇంటర్నల్ మార్కులను ఆధారంగా చేసుకుని గ్రేడ్ లను ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధులందరూ పదో తరగతిలో మంచి గ్రేడ్ ను సాధించారు. ఇప్పుడు విద్యార్ధులు పై చదువులు చదివేందుకు గాను బోర్డు వారి ఒరిజినల్ మార్కుల జాబితాను, ఇతర ధృవపత్రాలను అందచేసేందుకు సిద్దంగా ఉన్నారు.