Telangana Schools 2021-22: తెలంగాణలో స్కూళ్లకు దసరా, సంక్రాంతి సెలవులు, పరీక్షల తేదీలివే..

Telangana Schools 2021-22: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఈయర్ క్యాలెండర్ విడుదల చేసింది.

Update: 2021-09-04 14:34 GMT

తెలంగాణలో స్కూళ్లకు దసరా, సంక్రాంతి సెలవులు, పరీక్షల తేదీలివే..

Telangana Schools 2021-22: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఈయర్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ ఏడాది 213 రోజులు పాఠశాల పని దినాలుగా ప్రకటించారు. 2022 ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలల పని దినం చివరి రోజుగా వెల్లడించారు. 47 రోజులు ఆన్లైన్ ద్వారా 166 రోజులు ప్రత్యక తరగతులు ద్వారా పాఠశాలలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయా తెలిపారు. అక్టోబర్ 6 నుంచి 17 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు, జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాని తెలిపారు.

ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌1 పరీక్షలు.. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతాయి. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌1 పరీక్షలు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు జరుగుతాయి. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌2 పదవ తరగతి పరీక్షలు జనవరి 31 నుంచి స్టార్టవుతాయి. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌2 పరీక్షలు ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నుండి ప్రారంభమవుతాయి. సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌2 పరీక్షలు 1 నుండి 9 వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 7 నుండి18 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 25 లోపు పదో తరగతి ప్రీఫైనల్, మార్చి లేదా ఏప్రిల్ నెలలో పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

Tags:    

Similar News