Assembly Sessions: అక్టోబర్ 5 వరకు తెలంగాణ శాసనసభ సమావేశాలు
Assembly Sessions: బీఏసీలో షెడ్యూల్ సిద్ధం చేసిన సర్కార్
Assembly Sessions: తెలంగాణ శాసనసభ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ రోజులు జరపాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. కరోనా అదుపులో ఉండటం వల్ల ఎక్కువ రోజులు జరపాలని సభ్యులు కోరారు. 8 పనిదినాల పాటు సమావేశాలు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదించింది. 20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ కోరింది. 12 అంశాలపై చర్చించాలని సీఎల్బీ నేత భట్టివిక్రమార్క కోరారు. అందుకు సంబంధించిన జాబితాను సంఘానికి అందజేశారు. ప్రాథమికంగా మాత్రం సమావేశాలను అక్టోబర్ 5వరకు నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు.
తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమై సోమవారానికి వాయిదా పడ్డాయి. సమావేశాల మొదటి రోజున ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సంతాపం ప్రకటించారు. సంతాప తీర్మానాల అనంతరం ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు. తొలిరోజు సమావేశంలో ఇటీవల మరణించిన మాజీ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. శాసనమండలిలో ప్రొటెం ఛైర్మన్ హోదాలో సంతాప తీర్మానాన్ని భూపాల్ రెడ్డి చదివి వినిపించారు. అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై అంశంపై బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది..మరోవైపు.. ఎక్కువ రోజులు సభ నడపాలని కోరినట్లు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తెలిపారు. చాలా అంశాలపై చర్చ జరపాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం కొన్ని అంశాలపై చర్చ జరపాలనుకుంటోందని చెప్పిన భట్టి.. తాము అడిగినన్ని రోజులు సభ నడుపుతామన్నారని చెప్పారు. అయితే బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఉపసభాపతి పద్మారావు, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తరహాలో క్లబ్ నిర్మిస్తామని వివరించారు. దీని కోసం అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎంపీతో కలిసి ఢిల్లీ వెల్లి స్టడీ చేయనున్నారు. మరోవైపు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలన్నారు. అర్థవంతమైన, ముఖ్యమైన అంశమైతే సమయం ఇవ్వాలన్నారు. కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలని తెలిపారు. తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు సమయం కేటాయిస్తున్నామని కేసీఆర్ అన్నారు.
మొత్తానికి గతానికి భిన్నంగా ఈసారి బీఏసీ సమావేశంలో ఏలాంటి స్ఫష్టమైన నిర్ణయం తీసుకోకుండానే ముంగించారు. గతంలో బీఏసీ సమావేశంలో స్ఫష్టమైన ఎజెండాతో సమావేశం నిర్వహించే తేదీలను ప్రకటించే వారు కాని ఎన్ని రోజులు సభలు నిర్వహించేది స్పీకర్ నిర్ణయిస్తారని అధికార ప్రతిపక్షాలు చెబుతుండటం విశేషం.