Stray Dogs: వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్..కమిటీ ఏర్పాటు చేయాలంటూ GHMC కి ఆదేశాలు

Stray Dogs: పిల్లలపై వీధి కుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. ప్రభుత్వం, జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీధికుక్కల దాడుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది కోర్టు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేపెట్టేది లేదని హెచ్చరించింది. ఈ క్రమంలో వీధికుక్కల నియంత్రణకు ఓ కమిటీ వేయాలని జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది.

Update: 2024-07-11 00:35 GMT

Stray Dogs: వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్..కమిటీ ఏర్పాటు చేయాలంటూ GHMC కి ఆదేశాలు

Stray Dogs:నగరంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధి కుక్కల బెడదపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. వీధి కుక్కల అంశాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు..వాటిని నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పిల్ విచారణ సందర్బంగా..వీధి కుక్కల దాడిలో చిన్నపిల్లలు మరణించిన ఘటనలను గుర్తు చేసిన హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని పేర్కొంది. విధుల పట్ల జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు పెరిగిపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది కోర్టు.

జీహెచ్ఎంసీ పరిధిలో తరచూ వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని..వీధి కుక్కల దాడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విక్రమాదిత్య అనే లాయర్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ పిల్ పై బుధవారం విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన బాగ్ అంబార్ పేట్ లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మరణించిన ఘటనను గుర్తుచేశారు పిటిషనర్. ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి, అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఈ పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు..కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సర్కార్ ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభుత్వం వీధి కుక్కల నియంత్రణ చర్యలపై హైకోర్టుకు నివేదిక ఇచ్చింది.

అటు హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం హైకోర్టుకు అందించిన నివేదికలో వెల్లడించింది. అయితే ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సింది ధనవంతులు నివసించే ప్రాంతంలో కాదని..సామాన్య ప్రజలు నివసించే మురికివాడలు, సాధారణ ప్రజలు నివసించే ప్రాంతాలు అని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు ప్రభుత్వం చూపించిన లెక్కలపైనా తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారు న్యాయమూర్తి. తమకు లెక్కలు అవసరం లేదని వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటే మంచిదని సూచించింది.

Tags:    

Similar News