HYDRAA: హైడ్రాను రద్దు చేయాలని పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

HYDRAA: హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులు, నాళాలు ఆక్రమించిన కబ్జాదారుల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది.

Update: 2024-09-14 01:15 GMT

HYDRAA: హైడ్రాను రద్దు చేయాలని పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

HYDRAA: హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో చెరువులు, నాళాలు ఆక్రమించిన కబ్జాదారుల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. గడిచిన రెండు నెలలుగా హైడ్రా వార్తలు కుదిపేస్తున్నాయి. పలు అక్రమ కట్టడాలను కూల్చి వేసి దాదాపు 111 ఎకరాల భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే చాలు ఎలాంటి నోటీసులు సైతం లేకుండా కూల్చివేతలు చేపట్టారు. అయితే జీవో 99ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలు నిలిపి వేసే విధంగా హైడ్రాకి ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ క్ర‌మంలో హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా కూల్చివేయ‌డంపై ఆగ్ర‌హం వెలిబుచ్చారు. వివ‌ర‌ణ తీసుకోకుండా నిర్మాణాలు ఎలా కూల్చివేస్తార‌ని ప్ర‌శ్నించారు. జీవో 99పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ ప్ర‌భుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అమీన్‌పూర్‌లో ఈ నెల 3న షెడ్లు కూల్చివేశార‌ని పిటిష‌న‌ర్ కోర్టుకు తెలిపారు. హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఉన్న‌ప్ప‌టికీ కూల్చేశార‌ని పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే కూల్చేసిన‌ట్లు కోర్టుకు పిటిష‌న‌ర్ తెలిపారు. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను రెండు వారాల‌కు కోర్టు వాయిదా వేసింది.

Tags:    

Similar News