Telangana: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా?

Telangana: పరీక్షలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయని ప్రభుత్వం

Update: 2023-12-26 04:45 GMT

Telangana: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా?

Telangana: తెలంగాణ గ్రూప్-2 అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదాపడిన ఈ ఎగ్జామ్స్ ఈసారైనా జరుగుతాయో లేదోనని సందిగ్ధంలో ఉన్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ టీఎస్‌పీఎస్సీ రెండు నెలల క్రితమే ప్రకటించింది. తాజాగా గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మరో 10 రోజుల్లో గ్రూప్‌ 2 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ పరీక్షల ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పైగా ఇప్పటికే టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖలన్నీ గవర్నర్‌ కార్యాలయానికి పంపారు.

అయితే రాజీనామాలు పంపినా గవర్నర్‌ కార్యాలయం నుంచి వాటిని ఆమోదిస్తున్నట్లుగానీ.. తిరస్కరిస్తున్నట్లుగానీ ఎలాంటి సమాచారం అందలేదు. వారి రాజీనామాలను గవర్నర్‌ ఆమోదిస్తే తప్ప కొత్తగా చైర్మన్‌ను, సభ్యులను నియమించే అవకాశం లేదని అంటున్నారు. పరీక్షల నిర్వహణ, నియామకాలకు సంబంధించిన అంశాల్లో చైర్మన్, సభ్యులు కీలకం కావడంతో.. వారి నియామకాలు పూర్తయితే తప్ప గ్రూప్‌-2 ఎగ్జామ్ నిర్వహించే వీలు లేదని..‎ దీంతో జనవరిలో జరగాల్సిన గ్రూప్‌ 2 పరీక్షల నిర్వహణ కష్టమేనని సమాచారం.

Tags:    

Similar News