Telangana: కరోనా దెబ్బకు మళ్లీ స్కూళు మూసేస్తారా?

Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. చాపకింద నీరులా వైరస్‌ విజృంభిస్తోంది.

Update: 2021-03-17 15:21 GMT

కరోనా దెబ్బకు మళ్లీ స్కూళు మూసేస్తారా?

Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. చాపకింద నీరులా వైరస్‌ విజృంభిస్తోంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. స్కూల్సే హాట్ స్పాట్స్‌గా కోవిడ్ శరవేగంగా విస్తరిస్తోంది. దాంతో, ఉపాధ్యాయులు, విద్యార్ధులు వైరస్ బారిన పడుతున్నారు. కేసులు అధికంగా నమోదవుతున్న స్కూళ్లను మూసేసి రెడ్ జోన్స్‌గా ప్రకటిస్తున్నారు. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో టీచర్స్, స్టూడెంట్స్‌తో పాటు ప్రజలు కూడా భయంతో వణికిపోతున్నారు.

విద్యార్థులే టార్గెట్‌గా కరోనా విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ సోమేష్‌కుమార్, విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో 1-8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్షపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాప్తి పట్ల సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ర్టంలో క‌రోనా వ్యాప్తిపైనా క‌న్నేసి ఉంచామ‌ని స్పష్టం చేశారు. గ‌త వారం రోజుల నుంచి రాష్ర్టంలో క‌రోనా పెరుగుద‌ల క‌నిపిస్తుందని ఆయన అన్నారు. క‌రోనా వ్యాప్తిపై క‌న్నేసి ఉంచామని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ప‌క‌డ్బందీగా వ్యవ‌హ‌రిస్తోందన్న కేసీఆర్ దేశం ప‌రిస్థితి కంటే మ‌న రాష్ర్టం ప‌రిస్థితి మెరుగ్గా ఉందని పేర్కొన్నారు.

Tags:    

Similar News