స్థానికత రిజర్వేషన్ అంశంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్
స్థానిక రిజర్వేషన్ వర్తించదంటూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన
స్థానికత రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ శాశ్వత నివాసులు రాష్ట్రం బయట చదువుకున్నంత మాత్రానా స్థానిక రిజర్వేషన్ వర్తించదంటూ ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. తెలంగాణలో చదువుకోలేన్న కారణంతో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లను నిరాకరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని శంకర్ నారాయణ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. స్పందించిన న్యాయస్థానం త్వరలోనే విచారణ జాబితాలో చేరుస్తామని సీజేఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు.