స్కూళ్ల రీ-ఓపెన్‌పై క్లారిటీకి వచ్చిన తెలంగాణ సర్కార్

* ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్కూళ్లు తెరవద్దని భావిస్తున్న ప్రభుత్వం * స్కూళ్లు తెరిచినా తల్లిదండ్రులు పంపించే అవకాశంలేదు * పిల్లలు భౌతిక దూరం పాటించడం కష్టమే.. * 9-10 తరగతులకు మాత్రం కనీసం 90 రోజులు విద్యాబోధన అందించాలని యోచన

Update: 2020-12-24 06:22 GMT

లాక్‌ డౌన్ తర్వాత అన్ని ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నాయి. కానీ విద్యాసంస్థల విషయంలో గందరగోళం మాత్రం విడడం లేదు. అసలు స్కూళ్లు ఉంటాయా.. ఉండవా అని తెలియక తల్లిదండ్రులు అయోమయోంలో ఉన్నారు. అయితే స్కూళ్లు తెరిచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. పాఠశాలలు తెరిచినా పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి నుంచి 5 తరగతులకు స్కూళ్లు తెరవకూడదని నిర్ణయించినట్లు సమాచారం.

స్కూళ్లను ప్రారంభిస్తే.. పిల్లలు సోషల్‌ డిస్టెన్స్ పాటించడం అసాధ్యం. పిల్లలు వైరస్ బారినపడితే సమస్య తీవ్రతరం అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఐదో తరగతి వరకు బడులు ప్రారంభించకపోవడమే మంచిదని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆరు నుంచి 8 తరగతులకు పరిస్థితులను బట్టి ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకోనున్నారు. 9-10 తరగతుల విద్యార్థులకు మాత్రం కనీసం 90 రోజులు, గరిష్ఠంగా 120 రోజులపాటు ప్రత్యక్ష బోధన అందించాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News