New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు..

కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-09-16 11:58 GMT

New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు..

New Ration Cards: తెలంగాణలో ప్రజలు కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయక చాలా రోజులు అవుతోన్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులను త్వరలోనే మంజూరు చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా ఈ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అక్టోబర్‌ మొదటి వారంలోనే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రులు ఉత్తమ్ , పొంగులేటి రేషన్‌ కార్డులకు సంబంధించి ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా చేసిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోనున్నారు. అలాగే ఎమ్మార్వో ఆఫీస్‌, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారిని కూడా ఇందుకు సంబంధించి పరిగణలోకి తీసుకోనున్నారు.

రేషన్‌ కార్డులతో పాటు హెల్త్‌ కార్డులపై కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అక్టోబర్‌లోనే హెల్త్‌ కార్డులను కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. సోమవారం జరిగిన కేబినెట్ సబ్‌ కమిటీ మీటింగ్ అనంతరం ఈ విషయాలను వెల్లడించారు. గత ప్రభుత్వం కేవలం 50 వేల రేషన్‌ కార్డులను మాత్రమే ఇచ్చిందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అది కూడా కేవలం ఉప ఎన్నికలు నిర్వహించిన నియోజకవర్గాలోనే అని ఆరోపించారు.

కానీ తాము పారదర్శకంగా అర్హులందరికీ రేషన్‌ కార్డులను ఇస్తామని తెలిపారు. రేషన్‌ కార్డులకు సంబంధించి మరోసారి 21వ తేదీన కేబినెట్ సబ్‌ కమిటీ సమావేశం ఉంటుందని తెలిపిన మంత్రులు. ఆ సమయంలో పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటి రిపోర్ట్ ఇస్తుందని, అక్టోబర్ లో అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రులు స్పష్టం చేశారు.

Tags:    

Similar News