Telangana: వైరస్ కట్టడికి కార్యచరణ మొదలు పెట్టిన ప్రభుత్వం
Telangana: భయం వీడడం లేదు. ఇంకా వణికిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ గడగడలాడిస్తోంది.
Telangana: భయం వీడడం లేదు. ఇంకా వణికిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ గడగడలాడిస్తోంది. గత ఏడాది అతలాకుతలం చేసిన వైరస్ ఇప్పుడు మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నిన్నమొన్నటివరకూ నిత్యం జనంతో నిండివున్న నగరాలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి. మహా నగరాల నుంచి మారుమూల ప్రాంతాల వరకూ ఏదో తెలియని భయంతో నిశబ్దం అలముకుంటోంది.
కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది, టీకా కూడా వచ్చింది ఇక డోకా లేదని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో వైరస్ మళ్లీ విజృంభిస్తుండడం ఆందోళనకు గురిచేస్తున్నది. తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చాలా మంది కోవిడ్ బారినపడుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న క్రమంలోనే కేసుల ఉద్ధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోన కట్టడికి ఏకైక మార్గం వాక్సిన్ వేసుకోవడమే అని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10 లక్షల మందికి వాక్సిన్ వేశారు.
కోవిడ్ కొత్త నిబంధనల్లో భాగంగా టెస్టింగ్, ట్రెసింగ్, ట్రేటిమెంట్ ప్రోటోకాల్‌ని పకడ్బందిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్య భారీగా పెంచింది. ఇప్పటి వరకు అన్ని కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేసేవారు. ప్రస్తుతం phc హాస్పిటల్ లలో ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచుతున్నారు. సెకండ్ వెవ్ తో గత వారం రోజులుగా ప్రతి కేంద్రాల్లో వందలాది మంది అనుమానితులు టెస్టుల కోసం వస్తున్నారు. రోజుకు 60 వేలకు పైగా టెస్టులు చేస్తున్నారు. ఇక కొవిడ్ నిబంధనలు పాటించడంలో ప్రజల ఉదాసీనత వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. జాగ్రత్తలతోనే కరోనా ముప్పు నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.