GHMC పారిశుద్ద్య కార్మికులకు రూ.3వేల జీతం పెంపు

మరోవైపు కరోనా వారియర్స్‌కి దీపావళి కానుక ప్రకటించింది ప్రభుత్వం. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు అదనంగా 3వేల జీతాన్ని పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Update: 2020-11-14 09:26 GMT

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. 2020-21 ఆస్తి పన్ను చెల్లింపుల్లో మంత్రి కేటీఆర్ భారీ రాయితీని ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 15వేలలోపు ఆస్తి పన్ను కట్టేవారికి.. 50శాతం రాయితీని ప్రకటించారు. ఇతర పట్టణాల్లో రూ. 10వేలలోపు ఆస్తి పన్ను కట్టేవారికి 50శాతం రాయితీ ప్రకటించారు.

వరద బాధితులకు ప్రభుత్వం తరఫున 4వందల 75కోట్ల ఆర్థిక సాయం అందించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇంతవరకు వరద సాయం అందని బాధితులు మీసేవాలో దరఖాస్తు చేసుకునే వెసలుబాటు కల్పించామన్నారు. ఇందుకోసం మీసేవాల కొత్త ఆప్లికేషన్ ఏర్పాటు చేశామన్నారు.

మరోవైపు కరోనా వారియర్స్‌కి దీపావళి కానుక ప్రకటించింది ప్రభుత్వం. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు అదనంగా 3వేల జీతాన్ని పెంచుతున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దీంతో పారిశుధ్య కార్మికుల జీతం రూ.17,500లకు పెరిగింది. 

Tags:    

Similar News