దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌కేసులో మరో మలుపు

Update: 2019-12-09 05:38 GMT

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ జరుపుతుండగానే మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా సిట్‌ను ఏర్పాటు చేసింది. ఎన్‌‌కౌంటర్‌పై విమర్శలు చెలరేగుతుండటంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను అపాయింట్ చేసింది.

ఇందులో వనపర్తి ఎస్పీ అపూర్వరావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, రాచకొండ అడిషనల్‌ డీసీపీ సురేందర్‌రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, రాచకొండ ఐటీ సెల్‌ శ్రీధర్‌రెడ్డి, కోరుట్ల సీఐ రాజశేఖర్‌‌రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు, దానికి దారి తీసిన పరిస్థితులపై సిట్‌ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదిక సమర్పించనుంది.

Full View

Tags:    

Similar News