Delhi IAS Coaching Centre : ఢిల్లీ కోచింగ్ సెంటర్ మృతుల్లో తెలంగాణ యువతి

Delhi IAS Coaching Centre : ఢిల్లీలో సివిల్స్ ట్రైనింగ్ పొందుతూ వరదనీటిలో మరణించిన ముగ్గురిలో తెలంగాణకు చెందిన తాన్యా సోని అనే యువతి కూడా ఉంది. తాన్యా మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సహా..పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Update: 2024-07-29 04:33 GMT

Delhi IAS Coaching Centre : ఢిల్లీ కోచింగ్ సెంటర్ మృతుల్లో తెలంగాణ యువతి

Delhi IAS Coaching Centre : సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్ లో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్లో కి వరద నీరు పోటెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరద నీటిలో సివిల్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరణించిన వారిలో తెలంగాణకు చెందిన తాన్యా సోని (25) అనే యువతి ఉండటం దిగ్భ్రాంతికి గురి చేసింది. తాన్యా మరణంతో ఆమె స్వగ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి. తాన్యా మరణంపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ సహా పలువురు నేతలు సంతాపం తెలిపారు.

తాన్యా కుటుంబంలో మంచిర్యాలలో నివసిస్తోంది. ఆమె తండ్రి విజయ్ కుమార్ మంచిర్యాల జిల్లా శ్రీరామ్ పూర్ ఏరియాలోని శ్రీరాంపూర్ 1 భూగర్భ గని డీజీఎంగా విధులు నిర్వహిస్తుండగా..వీరు బీహార్ రాష్ట్రానికి చెందినవారు. విజయ్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉణ్నారు. తాన్యా పెద్ద కుమార్తె. సివిల్స్ ప్రిలిమ్స్ కోచింగ్ కోసం 6 నెలల క్రితం ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లో చేరారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భవనంలోని సెల్లార్ లో నిర్వహిస్తున్న రావూస్ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లైబ్రరీలోకి వరదనీరు చొచ్చుకురావడంతో తాన్యా వరద నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది.

కాగా ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాన్యా మరణంపై తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ తో మాట్లాడినట్లు ట్వీట్ చేశారు.అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాన్యా సోని తండ్రి విజయ్ కుమార్ కు ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూపతి తెలిపినట్లు కిషన్ రెడ్డి ట్విట్ చేశారు.బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. తాన్యా సహా మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన ప్రమాదం తర్వాత మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) ఇప్పుడు చర్య ప్రారంభించింది. నిబంధనలు ఉల్లంఘించే కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో బేస్‌మెంట్లలో నడుస్తున్న 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు.

Tags:    

Similar News