Telangana: నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ..
Telangana: నేటి నుంచి పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద, తెలంగాణ కోటా కింద కూడా ఉచిత బియ్యాన్ని కేసీఆర్ సర్కార్ పంపిణీ చేయనుంది.
Telangana: నేటి నుంచి తెలంగాణ లో తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచిత బియ్యాన్ని పంపిణి చేయానున్నారు. కరోనా విపత్తు ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే ఉచిత బియ్యంతో పాటు తెలంగాణ కోటా కింద కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది.
ఆహార భద్రత కార్డు(తెలుపు రేషన్ కార్డు)లో పేరున్న ఒక్కో వినియోగదారునికి 15 కిలోల చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎంతమంది ఉంటే అంత మందికికి 15 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తారు. మాములు రోజుల్లో అయితే ఒకొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేసేవారు కానీ ఈ నెలలో 15 కిలోలు పంపిణీ చేయనున్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) కింద మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికి 5 కిలోలు ఉచిత బియ్యం పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవటంతో మే నెలలో కేంద్రమిచ్చే కోటా పంపిణీ చేయలేదు. యథావిధిగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేశారు.
ఈనెలలో కేంద్రం కోటా, రాష్ట్రం కోటా కలిపి పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 53లక్షల 56వేల కార్డులకు అందించే పదిహేను కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33లక్షల 86వేల కార్డుదారులకు ఎలాంటి పరిమితి లేకుండా పదిహేను కిలోలు ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని 2,79,24,300 మందికి లబ్ది చేకూరనుంది.