Heavy Rains: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక నిర్ణయం.. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.130 కోట్ల విరాళం
తెలంగాణ వరద బాధితులకు సహాయం చేసేందుకు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకొచ్చింది. వరద బాధితులకు సహాయంగా వంద కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది.
Heavy Rains: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతో వరద బాధితులను ఆదుకునేందుకు జేఏసీ ముందడుగు వేసింది. దాదాపు 130 కోట్ల రూపాయలను సీఎం సహాయనిధికి విరాళంగా ఇచ్చింది. తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ ఒక రోజు మూల వేతనపు మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలంటూ తీర్మానం చేసింది.
తెలంగాణ వరద బాధితులకు సహాయం చేసేందుకు ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ముందుకొచ్చింది. వరద బాధితులకు సహాయంగా వంద కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించింది. రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందన్నారు.