Delhi: ఇవాళ ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ

Delhi: బస్సుయాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం

Update: 2023-10-13 04:45 GMT

Delhi: ఇవాళ ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ

Delhi: ఇవాళ ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాష్కి, ఇతర ఆశావహులు. ఇవాళ అభ్యర్థుల ఎంపికపై కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 72 మంది అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చింది. మిగిలిన నియోజకవర్గాలపై చర్చలు కొనసాగనున్నాయి. మరోవైపు.. సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సీఈసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగనుంది. చివరి నిమిషంలో మరికొన్ని చేరికలుండే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆఖరి నిమిషంలో చేరినవారికి అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రకటించే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. సీఈసీ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే.. ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. బస్సుయాత్ర తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News