Congress First List: నేడు 58 మంది అభ్యర్థులతో టీకాంగ్రెస్ తొలి జాబితా
Congress First List: ఈనెల 17న మరోసారి భేటీకానున్న కాంగ్రెస్ సీఈసీ ఈనెల 18న కాంగ్రెస్ తుది జాబితా
Congress First List: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాకు మోక్షం లభించింది. 58 మందితో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో హైకమాండ్ ఆధ్వర్యంలో అభ్యర్థులను ప్రకటించేందుకు రంగం సిద్ధం అయ్యింది. ఈ జాబితాలో గెలుపు అవకాశాలు అధికంగా ఉన్న నేతలతో పాటు పార్టీలో విధేయతతో పని చేసిన వారికే ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో మిగిలిన వారి పేర్లు ఖరారు చేసి ఈనెల 18న కాంగ్రెస్ తుది జాబితా ప్రకటించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ఇక వామపక్షాలతో పొత్తు చివరి దశకు చేరుకుంది. మునుగోడు, కొత్తగూడెం టికెట్లను సీపీఐ ఆశిస్తుండగా.. మిర్యాలగూడ, భద్రాచలం టికెట్ లు ఇవ్వాలంటుంది సీపీఎం. సీపీఐకి మునుగోడు, సీపీఎంకు మిర్యాలగూడ ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రతిపాదన పెట్టగా దీనికి లెఫ్ట్ పార్టీలు అంగీకరించడం లేదు. కాంగ్రెస్ మాత్రం వారికి ఒక్కోటికెట్ కు మించి అవసరం లేదంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలకు టికెట్‌లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌లోని ఓ కీలక నేత నిరాకరిస్తున్నట్టు సమాచారం. అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే పొత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.