Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన బాట
Revanth Reddy: కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక, మిగిలిన మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పదువుల నియామకంపై హైకమాండ్‌తో చర్చ
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తిన బాట పట్టారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రెండు మూడు రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. రేపు కాంగ్రెస్ హైకమాండ్‌తో రేవంత్ భేటీ కానున్నారు. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక, మిగిలిన మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదువుల నియామకంపై హైకమాండ్‌తో చర్చించనున్నారు. రుణమాఫీ పూర్తైన తర్వాత వరంగల్‌లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞతా సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించనున్నారు.