Telangana: అసెంబ్లీ న్యూ రికార్డ్.. తెల్లవారుజాము 3.15 గంటల వరకు సమావేశాలు

Telangana Assembly Session: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి. 5వ రోజు ఏకంగా 18 గంటలకు పైగా శాసనసభ జరిగింది.

Update: 2024-07-30 05:41 GMT

Telangana: అసెంబ్లీ న్యూ రికార్డ్.. తెల్లవారుజాము 3.15 గంటల వరకు సమావేశాలు

Telangana Assembly Session: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొత్త రికార్డు సృష్టించాయి. 5వ రోజు ఏకంగా 18 గంటలకు పైగా శాసనసభ జరిగింది. సోమవారం ఉదయం 10 గంటలకు మొదలైన శాసనసభ.. అర్థరాత్రి 3 గంటల 15 నిమిషాల వరకు సాగింది. గతంలో 12 గంటల పాటు కేసీఆర్‌ ప్రభుత్వం సభను నడిపింది. ఇప్పుడు ఆ రికార్డును రేవంత్‌ సర్కార్‌ బ్రేక్‌ చేసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సెషన్‌లో 19 పద్దులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది శాసనసభ. 19 పద్దులపై ఐదుగురు మంత్రులు సమాధానాలు ఇచ్చారు.

గత పదేళ్ల పాలనలో అదనపు విద్యుత్‌ ఉత్పత్తిని చేపట్టని బీఆర్‌ఎస్‌ సర్కార్.. రాష్ట్రంపై అప్పుల భారం మోపిందని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ ఉత్పాదననే తమ ఘనతగా చెప్పుకొని.. రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించిందన్నారు. తమ ప్రభుత్వం హయాంలో విద్యుదుత్పత్తి, సరఫరా మెరుగుపడ్డాయని తెలిపారు. అలాగే.. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు.. అర్హత నిష్పత్తిని 1:100 చేయాలన్న విజ్ఞప్తులు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని.. అయితే నోటిఫికేషన్‌ సమయంలోనే అర్హత ప్రాతిపదికను 1:50గా నిర్దేశించినందున, ఎవరైనా కోర్టుకు వెళితే సమస్యలు ఎదురై, పరీక్ష ఆలస్యమవుతుందన్న ఉద్దేశంతో తాము నిర్ణయం తీసుకోలేదని భట్టి పేర్కొన్నారు.

Tags:    

Similar News