ఏడు టీమ్స్..50 మెంబర్స్.. దిశ కేసులో యాక్షన్ ప్లాన్

Update: 2019-12-05 07:44 GMT

మహిళల భద్రతపై పెను సవాళ్లు విసిరిన దిశ అత్యాచారం, హత్య కేసు విచారణను సైబరాబాద్‌ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వేగంగా దర్యాప్తు జరిపి నెలరోజుల్లోపే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసును క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఏడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఏడుగురు పోలీసులు ఉండనున్నారు. మొత్తం 50 మంది పోలీసులు దిశ కేసును విచారించనున్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మొదలు కానిస్టేబుల్‌ వరకు ప్రతి ఒక్కరూ ఇన్వెస్టిగేషన్‌తో తమవంతు పాత్ర పోషించనున్నారు. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసేవరకు ఈ ఏడు పోలీసు బృందాలు పనిచేయనున్నాయి.

కేసులో కీలకం కానున్న సీసీటీవీ కెమెరా దృశ్యాల వీడియో అనాలసిస్‌, టెక్నీకల్‌ ఎవిడెన్స్‌ అనాలసిస్‌కు ఇంకొక టీమ్‌ పనిచేస్తోంది. సీన్ టు సీన్ అనాలసిస్, క్రైమ్ సీన్ రికన్‌స్ట్రక్షన్ కోసం మరో టీమ్‌ రంగంలోకి దిగింది. మొత్తానికి ఈ ఏడు బృందాలు సమన్వయంతో పనిచేస్తూ సత్వరమే ఆధారాలు సేకరించి సాక్ష్యాలు క్రోడీకరించే సమగ్రంగా నెలరోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సీపీ సజ్జనార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయడంతో నెలరోజుల్లోపు విచారణ జరిగి దోషులకు శిక్షలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News