Heavy Rains: ప్రయాణికులకు అలర్ట్.. భారీ వర్షాలతో 30 రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు..
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. అటు.. వరద ధాటికి పలుచోట్ల రైల్వేట్రాక్‌లు దెబ్బతిన్నాయి.
Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులను తలపిస్తున్నాయి రోడ్లు. అటు.. వరద ధాటికి పలుచోట్ల రైల్వేట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో.. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మరికొన్ని రైళ్లను డైవర్ట్ చేశారు అధికారులు.
ఆదివారం, సోమవారంలో దాదాపు 30 వరకు రైళ్లు రద్దయ్యాయి. విజయవాడ-సికింద్రాబాద్ మధ్య పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అలాగే.. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రైళ్లను దారి మళ్లించారు. సికింద్రాబాద్-విశాఖ వందే భారత్ ట్రైన్‌ను రీ షెడ్యూల్ చేశారు.
రద్దయిన ముఖ్య రైళ్ల వివరాలివీ..
17202 సికింద్రాబాద్-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్)
17201 గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్)
20708 విశాఖపట్నం-సికింద్రాబాద్ (వందేభారత్)
12713 విజయవాడ-సికింద్రాబాద్ (శాతవాహన)
12714 సికింద్రాబాద్-విజయవాడ (శాతవాహన)
17233 సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ (భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్)
12706 సికింద్రాబాద్-గుంటూరు (ఇంటర్‌సిటీ)
12705 గుంటూరు-సికింద్రాబాద్ (ఇంటర్ సిటీ)
12704 సికింద్రాబాద్-హౌవ్‌డా (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
12703 హౌవ్‌డా-సికింద్రాబాద్ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
17230 సికింద్రాబాద్-తిరువనంతపురం (శబరి ఎక్స్‌ప్రెస్)
17229 తిరువనంతపురం-సికింద్రాబాద్ (శబరి ఎక్స్‌ప్రెస్)
12862 మహబూబ్‌నగర్-విశాఖపట్నం (సూపర్‌ఫాస్ట్)
17058 లింగంపల్లి-ముంబయి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
17057 ముంబయి- లింగంపల్లి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
12762 కరీంనగర్-తిరుపతి (సూపర్‌ఫాస్ట్)