Sangareddy: లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకుల దుర్మరణం
Sangareddy: సంగారెడ్డి జిల్లా నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది.
Sangareddy: సంగారెడ్డి జిల్లా నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. కంది మండలం తునికిళ్ల తండా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పుల్కల్ మండలం గంగోజీపేటకు చెందిన సందీప్, నవీన్, అభిషేక్‌గా గుర్తించారు. ఈ ముగ్గురూ అక్షయపాత్రలో డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.