Hyderabad: పాల ప్యాకెట్ కోసం కుమారుడితో వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తన రెండేళ్ల కుమారుడిని బైక్‌పై తీసుకుని వెళ్తున్న ఓ తండ్రిని డీసీఎం వ్యాన్ బలి తీసుకుంది
Hyderabad: హైదరాబాద్ అబ్దుల్లాపూర్‌మెట్‌లో విషాదం నెలకొంది. తన రెండేళ్ల కుమారుడిని బైక్‌పై తీసుకుని వెళ్తున్న ఓ తండ్రిని డీసీఎం వ్యాన్ బలి తీసుకుంది. విజయవాడ రహదారి అయిన ఇనాంగూడ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయలుదేరిన ఆ తండ్రిని డీసీఎం రూపంలో మృత్యువు బలి తీసుకుంది.
అదృష్టవశాత్తు ఆ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఏం జరిగిందో తెలియని ఆ చిన్నారి తండ్రి మృతదేహం సమీపంలోనే కూర్చుండి ఏడుస్తూ ఉన్నాడు. కాగా ఆ చిన్నారికి కూడా యాక్సిడెంట్లో గాయాలయ్యాయి. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చిన్నారికి హాస్పిటల్‌కు తరలించారు. తండ్రి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని మార్చురీకి తరలించారు.