Revanth Reddy: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Revanth Reddy: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.

Update: 2024-06-15 03:14 GMT

Revanth Reddy: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Revanth Reddy: తెలుగు పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. S.C.E.R.T డైరెక్టర్ రాధారెడ్డి, పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డెరైక్టర్ శ్రీనివాస్ చారిని ప్రభుత్వం మార్చింది. శ్రీనివాస్ చారిని మోడల్ స్కూల్ డైరెక్టర్ గా బదిలీ చేసింది. తెలంగాణ గురుకుల సొసైటీ సెక్రటరీగా ఉన్న రమణ కుమార్ ను టెక్ట్స్ బుక్ ప్రింటింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది.

తెలుగు పుస్తకంలోని మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రుల పేరుతో ముందుమాటను S.C.E.R.T ప్రింట్ చేశారు. ఆలస్యంగా గ్రహించిన అధికారులు వాటి పంపిణీని ఆపింది. ముందుమాటను మార్చి విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కొత్తగా బుక్స్ ప్రింటింగ్ ఏమీ అవసరం లేదని ముందుమాట తొలగించి యధావిధిగా పుస్తకాలను ఇస్తామని సీఎంఓ వర్గాలు తెలిపాయి. దీంతో ప్రభుత్వానికి భారం పడేది ఏమి లేదని ప్రజాధనం వృథా కాదన్నారు.

Tags:    

Similar News