నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఎస్టీ అభ్యర్ధిని బరిలోకి దించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. నాగార్జునసాగర్‌లో ఎస్టీ ఓటర్లు అత్యధికంగా ఉండటంతో రామచంద్రు నాయక్ పేరును హైకమాండ్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. టీఆర్ఎస్ టికెట్ రేస్‌లో కోటిరెడ్డి, తేర చిన్నపరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నప్పటికీ నాగార్జునసాగర్‌లో 40వేలకు పైగా ఎస్టీ ఓటర్లు ఉండటంతో టీఆర్ఎస్ అధిష్టానం రామచంద్రు నాయక్ వైపు మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలోకి దిగితే రామచంద్రు నాయక్ అయితే మంచి పోటీ అవుతారని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు.