Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

Hyderabad: ఉపరితల ఆవర్తనం అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2021-06-10 12:15 GMT

Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

Hyderabad: ఉపరితల ఆవర్తనం అల్పపీడనం కారణంగా తెలంగాణలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నందున భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈనెల 12, 13 తేదీల్లో పలుచోట్ల తీవ్ర వర్షాలు పడే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇక, రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. దాంతో, హైదరాబాద్ వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

నైరుతి రుతు పవనాలు తెలంగాణ అంతటా విస్తరించినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఉపరితల ఆవర్తనం అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడుతున్నట్లు వెల్లడించారు. ఇక, పశ్చిమ దిశగా రాష్ట్రంలోకి చల్లని గాలులు వీస్తున్నందున అనేక చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అయితే, అల్పపీడనం, రుతు పవనాల కారణంగా కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

Tags:    

Similar News