Khammam: మూగజీవాలకు వైద్యం అందడం లేదని నిరసన

* రెండు మూడు రోజులకోసారి వస్తున్నారని ఆరోపణ.. గదిలో మందులు ఉంటే తీసుకెళ్లండంటూ కసురుకుంటున్నారని ఆరోపణ

Update: 2022-12-12 08:28 GMT

మూగజీవాలకు వైద్యం అందడం లేదని నిరసన

Khammam: ముగజీవాలకు వైద్యం అందించటం లేదని, డాక్టర్ అందుబాటులో ఉండటం లేదని గొర్రెలతో పశువుల హాస్పిటల్ ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరంలో పశువుల హాస్పిటల్ ఎదుట రైతులు గొర్రెలతో ఆందోళన చేపట్టారు. పశువైద్యులు రెండు మూడు రోజులకోసారి హాస్పిటల్‌కు వచ్చి వెళుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గొర్రెలకు జబ్బు చేస్తే మందులు కోసం వెళ్లి అడిగితే గదిలో మందులు ఉంటే తీసుకొని వెళ్లండి లేదంటే లేదంటూ గుర్రుమంటున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం సరఫరా చేయడం లేదని, తామెక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలని దురుసుగా సమాధానం చెబూతున్నాడని ఆరోపించారు. తేదీ ముగిసిన మందులు ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశువులను ఖమ్మంలోని డాక్టర్లకు చూపించి రిపోర్టు పట్టుకొని వస్తే తాము దానికి మందులు ఇస్తామంటున్నాడని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యులు అందుబాటులో ఉండేలా ముగజీవాలకు మందులు పంపిణీ చేసేలా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

Tags:    

Similar News