రామానుజ సహస్రాబ్ది వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Ram Nath Kovind: 120 అడుగుల రామానుజుల విగ్రహాం ఆవిష్కరణ, సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించనున్న కోవింద్.

Update: 2022-02-13 04:56 GMT

రామానుజ సహస్రాబ్ది వేడుకలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Ram Nath Kovind: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం హైదరాబాద్ రానున్నారు. ముచ్చింత్‌‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్నారు. మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 అడుగుల రామానుజుల బంగారు విగ్రహాన్ని కోవింద్ ఆవిష్కరిస్తారు. సమతామూర్తి భారీ విగ్రహాన్ని సందర్శించి ప్రసంగించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రామ్ నాథ్ కోవింద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 3.30 గంటలకు ముచ్చింతల్ చేరుకుంటారు. ప్రత్యేక పూజలు, ఆలయాలను సందర్శించనున్నారు. ముచ్చింతల్ నుంచి సాయంత్రం 5 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డుమార్గంలో రాజ్ భవన్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేసి ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్తారు రాష్ట్రపతి.

రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా హైదరాబాద్ నగరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతోపాటు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భద్రతా, ట్రాఫిక్ కారణాల దృష్ట్యా ఆదివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముచ్చింతల్ శ్రీ రామానుజ జీయర్ ఆశ్రమం వైపు ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News