నేటి నుంచి తెలంగాణలో ప్రజావాణి పునఃప్రారంభం
Prajavani: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన నేటి నుంచి పునఃప్రారంభం కానుంది.
Prajavani: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. ప్రజావాణి ఆర్జీల స్వీకరణ కార్యక్రమం ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభించనుంది ప్రభుత్వం. దేశంలో లోక్సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండడంతో ప్రజావాణి దరఖాస్తుల కార్యక్రమం కొంతకాలంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి ఆర్జీల స్వీకరణ కార్యక్రమం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్లో యథావిధిగా ప్రతి మంగళ, శుక్రవారాల్లో కొనసాగనుంది.